వరప్రసాద్ సీటు మార్చిన జగన్..!

Update: 2019-03-06 02:49 GMT

 వైసీపీ అధినేత వైయస్ జగన్ ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకు తగ్గట్టే వ్యూహాలు రచిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో బంధువులు, ముఖ్యులకు సైతం సీటు నిరాకరిస్తూ బలమైన అభ్యర్థుల వైపే దృష్టిసారించారు. చాలా చోట్ల అభ్యర్థులను మార్చేసిన జగన్.. తాజగా మరో ముఖ్యనేత సీటు మార్చరట.. గత ఎన్నికల్లో తిరుపతి ఎంపీగాపోటీ చేసి గెలిచిన వెలగపల్లి వరప్రసాద్ ను ఈసారి అసెంబ్లీకి పంపించాలని జగన్ అనుకుంటున్నారట.. తిరుపతి పార్లమెంటు సెగ్మెంటులోని గూడూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయమని జగన్ ఆదేశించారట.

ఈ ప్రతిపాదనను వరప్రసాద్ సైతం అంగీకరించినట్టు సమాచారం. అయితే గూడూరులో ఇటీవల టీడీపీనుంచి వైసీపీలో చేరిన నేతలకు ఇది మింగుడుపడటం లేదట. మరోవైపు తిరుపతి లోక్ సభకు ఎవరు పోటీ చేస్తారన్నది ఇంకా తెలియకపోయినా.. గత ఎన్నికల్లో చిత్తూరు ఎంపీగా పోటీ చేసిన సామాన్య కిరణ్ ఈ సీటు ఆశిస్తున్నారు. ఆమె తోపాటు ఓ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా జగన్ ను తిరుపతి ఎంపీ టికెట్ అడుగుతునట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరన్నది మాత్రం వైసీపీ నేతలు వెల్లడించడం లేదు. మరోవైపు గూడూరు ఇంచార్జ్ గా మరో వారం రోజుల్లో వరప్రసాద్ ను నియమిస్తారని టాక్ వినబడుతోంది. 

Similar News