కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఘాటు విమర్శలు
విద్య, వైద్యం ప్రైవేటీకరణ చేస్తామంటున్న కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఘాటు విమర్శలు
విద్య, వైద్యం ప్రైవేటీకరణ చేస్తామంటున్న కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు మండిపడ్డారు. నియంతృత్వ పాలన కలిగిన హిట్లర్, ముసోలిని వంటివారు ప్రజా వ్యతిరేకత నిర్ణయాల తీసుకుంటున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు అనుమతి తీసుకొనివచ్చి పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి ఎంతో తాపత్రయపడితే.. కూటమి ప్రభుత్వం వేల కోట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తుందన్నారు.
మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేస్తూ పేద ప్రజలకు ఇబ్బందులు కలగ చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటూ ప్రభుత్వాని రాచమల్లు హెచ్చరించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి MRO కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇంఛార్జీ తహాసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.