Perni Nani: పవన్ షూటింగ్‌లకే కాదు, రాజకీయాలకూ ఆలస్యమే
Perni Nani: పవన్‌ది వీకెండ్ ప్రజా సేవ అంటూ ఎద్దేవా
Perni Nani: పవన్ షూటింగ్‌లకే కాదు, రాజకీయాలకూ ఆలస్యమే
Perni Nani: పవన్ కల్యాణ్‌ది వీకెండ్ ప్రజా సేవ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. పవన్ షూటింగ్‌లకే కాదు రాజకీయాలకు కూడా ఆలస్యమేనని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం జగన్ నమ్మేది ప్రజల్ని.. పవన్ కల్యాణ్‌లా చంద్రబాబునో, మోడీనో కాదని స్పష్టం చేశారు. అధికారంలో ఉంటే కౌరవులు అయిపోతారా? అని పేర్నినాని ప్రశ్నించారు. టీడీపీ కూటమి అధికారంలో ఉన్నపుడు పవన్ కౌరవుడు కాదా అని కౌంటర్ ఎటాక్ చేశారు. కౌరవులు, పాండవులు అనేది అధికారాన్ని బట్టి కాదు, వాళ్ల లక్షణాలను బట్టి వస్తుందని ఆయన చెప్పారు.