జాతీయ మీడియా సైతం జగన్ తీరును తప్పుపట్టింది : చంద్రబాబు

Update: 2020-02-03 14:03 GMT
Chandra Babu File Photo

మూడు రాజధానుల నిర్ణయం సరైంది కాదని జాతీయ మీడియా కూడా తప్పుపట్టిందని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. అమరావతి కొన్ని వర్గాలది కాదని, అందరి బాధ్యతని ఆయన చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్‌ నిర్ణయాన్ని తప్పుబడుతూ జాతీయ పత్రికల్లో సంపాదకీయాలు వస్తున్నాయని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపుతో రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీయొద్దని, సామాజిక బాధ్యతతో వ్యవహరిచాలని జాతీయమీడియా రాస్తోందని తెలిపారు.

రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ప్రజలు మాకెందుకు అనుకుంటే తీవ్రంగా నష్టపోతామని చంద్రబాబు అన్నారు. అమరావతి పరిరక్షణ ఐదు కోట్ల మంది సమిష్టి బాధ్యతని తెలిపారు. రాజధాని రుణాల విషయంలో ప్రపంచ బ్యాంకు, ఆసియా బ్యాంకు వెనక్కి వెల్లడం మంచిది కాదని ఓ పత్రిక పేర్కొందని తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ పత్రికల సంబంధించిన క్లిపింకులు మీడియా ముందు ప్రదర్శించారు.

మూడు రాజధానులు ఎక్కడా విజయవంతం కాలేదు. సౌతాఫ్రికాలో మూడు రాజధానులు ఉన్నాయి తప్ప ప్రపంచంలో మరెక్కడా లేవని చంద్రబాబు అన్నారు. దక్షిణాఫ్రికాలో కూడా మూడు రాజధానులు ఒకే చోట పెట్టాలని నిర్ణయానికి వచ్చారని తెలిపారు. మూడు రాజధానులకు ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎలా వెళ్తారని ప్రశ్నించారు.

రాజధానులకు తిరగాలంటే ఖర్చు ఎక్కువగా ఉంటుందని, ప్రజలు ఇబ్బందులు పడతారని తెలిపారు. ఉద్యోగుల వేతనాలు పెంచాల్సి వస్తుందని, కేవలం పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి జరగదని చంద్రబాబు తెలిపారు. అమరావతి పోరాటాన్ని ప్రజాఉద్యమంగా మలచుకోవాలని సూచించారు. ఏపీలో పెట్టుబడులకు జగన్ గండి కొడుతున్నారని విమర్శించారు.

   

Tags:    

Similar News