Gannavaram Airport: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో విమానాల అత్యవసర ల్యాండింగ్
Gannavaram Airport: హైదరాబాద్‌లో వాతావరణం అనుకూలించకపోవడంతో.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో 3 విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్
Gannavaram Airport: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో విమానాల అత్యవసర ల్యాండింగ్
Gannavaram Airport: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానాలను అత్యవసర ల్యాండింగ్ చేశారు. హైదరాబాద్‌లో భారీ పొగ మంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో మూడు విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. చండీగఢ్ నుంచి హైదరాబాద్, గోవా నుంచి హైదరాబాద్, తిరువనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన మూడు ఇండిగో విమానాలను అత్యవసర ల్యాండింగ్ చేశారు ఎయిర్‌పోర్ట్ అధికారులు. అయితే.. ఒక్కో విమానంలో సుమారు 165 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. విమానాల అత్యవసర ల్యాండింగ్‌తో ఏమవుతుందో తెలియక అయోమయంలో ఉండిపోయారు ప్రయాణికులు.