విజయనగరం జిల్లాలో ఏనుగుల బీభత్సం.. దాడిలో అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తి

Vizianagaram - Elephant Attack: ఏనుగులను తరలించి తమను కాపాడాలని కోరుతున్న స్థానికులు...

Update: 2022-01-10 02:30 GMT

విజయనగరం జిల్లాలో ఏనుగుల బీభత్సం.. దాడిలో అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తి

Vizianagaram - Elephant Attack: విజయనగరం జిల్లాలో ఏనుగుల బీభత్సం కొనసాగుతూనే ఉంది. నిన్న రాత్రి కొమరాడ మండలం దుగ్గి గ్రామం వద్ద ఏనుగులు... ఎలిఫాంట్ ట్రాకర్‌పై దాడి చేసాయి. ఈ దాడిలో ఎలిఫాంట్ ట్రాకర్ నిమ్మక రాజబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు శ్రీకాకుళం జిల్లా గుమడ వాసిగా గుర్తించారు. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీ శాఖ అధికారులు ఏనుగుల దాడిపై అధికారులకు సమాచారం అందించామని, అధికారుల సూచన మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అయితే గత నాలుగు సంవత్సరాలుగా ఏనుగుల దాడిలో 7గురు మృతి చెందారని, పొలాల్లోకి వెళ్లాలంటేనే భయంగా ఉందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడిలో అటవీశాఖ ఉద్యోగి బలి కావడంతో తమ పరిస్థితి ఏంటంటూ గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఏనుగులను తరలించి తమను కాపాడాలని వేడుకంటున్నారు.

Tags:    

Similar News