విద్యుత్ పాత బకాయిల వసూళ్లు

మండలంలో విద్యుత్ శాఖ అధికారులు గతంలో చెల్లించాల్సిన పాత విద్యుత్ బకాయిలను వసూలు చేసినట్లు విద్యుత్ శాఖ అధికారి చెన్న కృష్ణ తెలిపారు.

Update: 2019-12-13 04:14 GMT
విద్యుత్ శాఖ అధికారి చెన్న కృష్ణ, డి నాగేంద్ర కుమార్, ముదిగుబ్బ, పుట్టపర్తి, కదిరి ఏఈలు

ఓబులదేవరచెరువు: మండలంలో విద్యుత్ శాఖ అధికారులు గతంలో చెల్లించాల్సిన పాత విద్యుత్ బకాయిలను వసూలు చేసినట్లు విద్యుత్ శాఖ అధికారి చెన్న కృష్ణ తెలిపారు. కుంట్ల పల్లి, ఇనగలూరు, కొండకమర్ల, గాజుగుంటపల్లి, మిట్టపల్లి నవాబు కోట తంగేడు కుంట ఎం బి క్రాస్ ఒడిసి మండల కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు.

గతంలో చెల్లించాల్సిన బకాయిలు చెల్లిస్తే నాణ్యమైన విద్యుత్ను ప్రభుత్వం సకాలంలో అందజేస్తుందని రైతులు బకాయిలు లేకుండా విద్యుత్ బిల్లులు చెల్లించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో డి నాగేంద్ర కుమార్, ముదిగుబ్బ, పుట్టపర్తి, కదిరి ఏఈలు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.


Tags:    

Similar News