Andhra Pradesh: ఏపీలో 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు

* ఓటుహక్కు వినియోగించుకోనున్న 8,07,640 మంది ఓటర్లు * 954 కేంద్రాల్లో పోలింగ్‌ * 18న ఓట్ల లెక్కింపు

Update: 2021-11-16 01:25 GMT

 ఏపీలో 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు(ఫైల్ ఫోటో)

Andhra Pradesh: ఏపీలో 10 జెడ్పీటీసీ స్థానాలకు, 123 ఎంపీటీసీ స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. వివిధ కారణాలతో అప్పట్లో ఆగిపోయిన, గెలిచినవారు మరణించిన కారణంగా ఆయా స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

ఇవికాకుండా గతంలో ఓట్ల లెక్కింపు సమయంలో తడిసిన ఓట్ల కారణంగా లెక్కింపు ఆగిపోయిన కడప జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలో రెండు బూత్‌లతోపాటు మరో ఆరు ఎంపీటీసీ స్థానాల్లోను పోలింగ్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారులు చెప్పారు.

మొత్తం 14 జెడ్పీటీసీ స్థానాలు, 176 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీచేయగా నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, 50 ఎంపీటీసీ స్థానాల ఎన్నిక ఏకగ్రీవం అయ్యాయి. మూడు ఎంపీటీసీ స్థానాల్లో ఎవరూ నామినేషన్ల దాఖలు చేయకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలినచోట్ల 954 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.

జెడ్పీటీసీ స్థానాల్లో 40 మంది, ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 8,07,640 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. అవసరమైన చోట బుధవారం రీ పోలింగ్‌ నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కింపు కొనసాగించనున్నారు. 

Tags:    

Similar News