Election Counting: కాసేపట్లో ప్రారంభంకానున్న కౌంటింగ్

Election Counting: 24 వార్డుల్లో 9 సమస్యాత్మక వార్డుల గుర్తింపు

Update: 2021-11-17 03:06 GMT

కాసేపట్లో ప్రారంభం కానున్న ఎన్నికల లెక్కింపు (ఫైల్ ఇమేజ్)

Election Counting: ఏపీలో నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాల్టీలు, నగర పంచాయతీల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మాత్రం ఒకే మున్సిపాలిటీ. అదే.. చంద్రబాబు ఇలాఖ కుప్పం. దీంతో.. కుప్పం మున్సిపల్‌ ఎన్నికలు ఇరుపార్టీలకు పెద్ద అగ్నిపరీక్షలా మారాయి.

కుప్పం మున్సిపల్‌ ఎన్నికలు మొదటి నుంచి ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేయడంతో సొంతగడ్డపై చంద్రబాబు ఒంటరి అయిపోయారు. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లోనైనా గెలిచి, సత్తా చాటాలని టీడీపీ భావిస్తోంది. మరి ఫ్యాన్‌ హవాను తట్టుకొని సైకిల్‌ నిలబడుతుందో లేదో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. కుప్పంలోని మొత్తం 24 వార్డుల్లో 9 వార్డులను సమస్యాత్మకంగా గుర్తించిన పోలీసులు.. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.

మరోవైపు.. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ కోర్టు మెట్లెక్కింది. ఎన్నికలపై హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన టీడీపీ ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక అధికారిని నియమించాలని కోరింది. దీనిపై విచారించిన ఉన్నత ధర్మాసనం.. ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించింది. ప్రత్యేక పరిశీలకుడిగా ఐఏఎస్‌ ప్రభాకర్‌రెడ్డిని నియమించాలని ఎస్‌ఈసీకి ఆదేశాలు ఇచ్చింది. అలాగే.. ఓట్ల లెక్కింపును వీడియో రికార్డు చేయించాలన్న టీడీపీ అభ్యర్థుల పిటిషన్‌పై సానుకూలంగా స్పందించిన హైకోర్టు... ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News