ఏపీలో పోలింగ్‌ శాతంపై ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన.. ఎంతో తెలుసా?

Update: 2019-04-12 03:25 GMT

ఏపీలో పోలింగ్‌ శాతం ఎంత అనేదానిపై ఉత్కంఠకు తెరపడింది. మొత్తం 76.69 శాతంగా పోలింగ్‌ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే 1.3 శాతం పోలింగ్‌ తగ్గింది. జిల్లాల వారీగా పోలింగ్‌ శాతాన్ని చూస్తే.... శ్రీకాకుళం జిల్లాలో 72 శాతం, విజయనగరం జిల్లాలో 85 శాతం, విశాఖపట్నంలో 70, తూర్పు గోదావరి జిల్లాలో 81, పశ్చిమగోదావరి జిల్లాలో 70, కృష్ణా జిల్లాలో 79, గుంటూరు జిల్లాలో 80, ప్రకాశం జిల్లాలో 85, నెల్లూరు జిల్లాలో 75 శాతం, కడప జిల్లాలో 70 శాతం, కర్నూలు జిల్లాలో 73 శాతం, అనంతపురంజిల్లాలో 78 శాతం, చిత్తూరు జిల్లాలో 79 శాతం ఇక ఈవీఎంలను.. ఆయా ప్రాంతాల్లో భద్రపరిచారు. అటవీప్రాంత ఏరియాల్లో హెలికాఫ్టర్ ద్వారా ఈవీఎంలను తరలించారు.

కాగా ఆయా ప్రాంతాల్లో రీపోలింగ్‌ జరపాల్సిన ఆవశ్యకతపై శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీనిపై ఎన్నికల సంఘం పరిశీలకులు శుక్రవారం ఉదయం పరిశీలిస్తారని పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్‌ వివరాలను కేంద్ర ఎన్నికల సం ఘం డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ ఉమేష్‌ సిన్హా గురువారం రాత్రి మీడియాకు వెల్లడించారు.

Similar News