నామినేషన్ దాఖలు చెయ్యకుండా అడ్డుకుంటే చర్యలు తప్పవు : ఎన్నికల కమిషనర్

పోటీ చేసే అభ్యర్థుల ను నామినేషన్ దాఖలు చెయ్యకుండా అడ్డుకునే చర్యలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్

Update: 2020-03-10 14:30 GMT
Election commission

పోటీ చేసే అభ్యర్థుల ను నామినేషన్ దాఖలు చెయ్యకుండా అడ్డుకునే చర్యలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన లో హెచ్చరించారు. ఎన్నికలను స్వేచ్ఛగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఉద్దేశపూర్వకంగా పోటీ చేసే అభ్యర్థులకు అడ్డంకులు సృష్టించేందుకు కొందరు పర్యటిస్తున్నారన్న సమాచారం తో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమోటోగా సంబంధించిన వ్యక్తులపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి, పోలీసు కేసు నమోదు చెయ్యడం జరిగిందన్నారు. ఎన్నికల విధుల్లో ఆటంకాలు కలుగచేసినా, ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తించినా ఎన్నికల కమిషన్ చూస్తూ ఉరుకోదన్నారు. చట్టవ్యతిరేకమైన కార్యక్రమాల్లో పాల్గొని ఎన్నికల సమయంలో ఇబ్బందులకు కలుగాచెయ్యడాన్ని కూడా తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు.

Tags:    

Similar News