East Godavari: పేకాట ఆడుతూ పట్టుబడ్డ కొత్తపేట తహశీల్దార్..
East Godavari: *రాఘవాపురంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి *పేకాట ఆడుతున్న పది మంది అరెస్ట్
East Godavari: పేకాట ఆడుతూ పట్టుబడ్డ కొత్తపేట తహశీల్దార్..
East Godavari: తూర్పు గోదావరి జిల్లాలో ఓ తహశీల్దార్ పేకాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. కోరుకొండ మండలం రాఘవాపురంలో పేకాట స్థావరంపై రాజమండ్రి అర్బన్ జిల్లా పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న పది మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో కొత్తపేట తహశీల్దార్ కిశోర్ బాబు ఉన్నారు. సుమారు లక్ష రూపాయల నగదు, 11 సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. కోరుకొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యా్ప్తు చేస్తున్నారు.