Carona Virus: తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కలకలం
Carona Virus: మోరీ పీహెచ్‌సీ పరిధిలో 17 మందికి కోవిడ్ పాజిటివ్.
Representational Image
Carona Virus: తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో కరోనా కలకలం రేగింది. సఖీనేటిపల్లి మండలం మోరీ పీహెచ్‌సీ పరిధిలో 17 మందికి కరోనా నిర్థారణ అయింది. మలికిపురం MPUP పాఠశాలకు చెందిన నలుగురు ఉపాధ్యాయులు, ఒక వంట మనిషి, అంతర్వేదికి చెందిన మరో వ్యక్తికి కరోనా సొకింది.
పంచాయతీ ఎన్నికల విధులకు వెళ్లిన సమయంలో కరోనా సోకినట్లు వైద్యులు నిర్థారించారు. ఇక మలికిపురం MPUP పాఠశాలలో 180 మంది వరకు విద్యార్థులు ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. విద్యార్థులకు రేపు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.