Visakhapatnam: అప్రమత్తతతో కరోనా కట్టడి

కరోనా ఎక్కడో చైనాలో ఉందనుకునేలోపు నెల్లూరులో కనబడింది.

Update: 2020-03-16 08:12 GMT

విశాఖపట్నం: కరోనా ఎక్కడో చైనాలో ఉందనుకునేలోపు నెల్లూరులో కనబడింది. రెండ్రోజులు తిరిగేలోపు దేశ వ్యాప్తంగా 107 మందికి సోకింది. దీంతో కరోనా గురించి తేలికగా మాట్లాడిన ప్రభుత్వాలు కళ్లు తెరిచాయి. హైదరాబాద్‌ సహా పలు ప్రధాన నగరాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలే దీనికి నిదర్శనం. వ్యాక్సిన్‌ కోసం రెండేళ్లయినా ఆగాలని శాస్త్రవేత్తలు తేల్చేసిన నేపథ్యంలో విశాఖ జిల్లా యంత్రాంగమూ అప్రమత్తమైంది. నగరంలో అన్ని శాఖల అధికారులూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విమ్స్‌ హాస్పటల్‌లో 12, 13 బ్లాకుల్లో కరోనా వ్యాధిగ్రస్తుల నిర్ధారణ కోసం ప్రత్యేక క్వారంటైన్‌ వార్డులు ఏర్పాటు చేశారు. ఇక్కడ విదేశీయులను 14 నుంచి 28 రోజుల పాటు పరీక్షించి కరోనా లేదని నిర్థారించిన తర్వాత వదిలిపెడతామని అధికారులు చెబుతున్నారు.

ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా గీతం, గాయత్రి, 104 ఏరియా, నేవీ హాస్పటల్‌ ఇలా అన్ని ఆస్పత్రుల్లోనూ 600 పడకలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. బయోమెట్రిక్‌ను తాత్కాలికంగా అనేక కంపెనీలు నిలిపివేశాయి. రైల్వే స్టేషన్లలో హెల్ప్‌ డెస్కులు ఏర్పాటు చేశారు. ఏసీ బోగీల్లో ఎప్పటికప్పుడు దుప్పట్లు, తలగడలు మారుస్తున్నారు. పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలు వేసి ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నారు.



Tags:    

Similar News