Kota Vinutha: కోట వినుత సెల్పీ వీడియో విడుదల.. చేయని తప్పుకు జైలుకు వెళ్లా..
Kota Vinutha: జనసేన బహిష్కృత నాయకురాలు కోట వినుత సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
Kota Vinutha: జనసేన బహిష్కృత నాయకురాలు కోట వినుత సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తన డ్రైవర్ శ్రీనివాసులు హత్య కేసులో తమ ప్రమేయం లేదని ఆమె చెప్పుకొచ్చారు. మనసునిండా పుట్టెడు బాధ ఉందని చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ లేకపోయినా తామే చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తోందని అన్నారు. రాయుడు చావులో తమ ప్రమేయం లేదని కోర్టు భావించింది కాబట్టే 19 రోజుల్లో బెయిలు ఇచ్చిందని చెప్పారు.
శ్రీనివాసులు హత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో క్లీన్‌చిట్‌తో బయటకు వస్తామని కోట వినుత ధీమా వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలవడానికి ప్రయత్నిస్తున్నానని త్వరలో అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తాననిసెల్ఫీ వీడియోలో కోట వినుత తెలిపారు.
కాగా హత్యకు గురైన కోట వినుత డ్రైవర్ శ్రీనివాసులుకు సంబంధించిన ఓ వీడియో నిన్న విడుదలైంది. అందులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి తన ద్వారా కోట వినుత అమె భర్త చంద్రబాబుపై కుట్ర పన్నారంటూ ఆ వీడియోలో చెప్పడం చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో తమ ప్రమేయం లేదంటూ తాజాగా కోట వినుత సెల్ఫీ వీడియో విడుదల చేశారు.