Vizianagaram: విజయనగరం జిల్లాలో గిరిపుత్రుల అవస్థలు

Vizianagaram: చినుకు పడితే తప్పని డోలి కష్టాలు

Update: 2021-09-28 09:20 GMT

గిరిజనులకు తప్పని డోలి కష్టాలు (ఫైల్ ఇమేజ్)

Vizianagaram: విజయనగరం జిల్లాలోని గిరిపుత్రులకు డోలి కష్టాలు తప్పడం లేదు బాలింతకు వైద్యం కోసం నాలుగు కిలోమీటర్లు డోలీలో మోసుకుంటూ వెళ్లారు బంధువులు గులాబ్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీలో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. పాచిపెంట మండలం కేరంగి గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గిరిశి‌ఖర గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. పనుకువలసకు చెందిన బంగారమ్మ అనే బాలింతరాలుకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే భారీవర్షాలకు నడకదారి కూడా కొట్టుకోపోవడంతో బాలింతను అతి కష్టం మీద ఆస్పత్రికి తరలించారు ప్రభుత్వాలు ఎన్ని మారినా పాలకులు ఎంత మంది మారిన తమ కష్టాలను పట్టించుకునే నాథుడే లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

Full View


Tags:    

Similar News