Chandrababu: తిరుమల కొండను భక్తులకు దూరం చెయ్యాలి అనుకుంటున్నారా..?

Chandrababu: కలియుగ వైకుంఠం విషయంలో అహంకారం వద్దు

Update: 2023-01-12 05:55 GMT

Chandrababu: తిరుమల కొండను భక్తులకు దూరం చెయ్యాలి అనుకుంటున్నారా..? 

Chandrababu: తిరుమల కొండపై గదుల అద్దె పెంచడంపై ట్విటర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తిరుమల శ్రీవారిని భక్తులకు దూరం చేయాలనుకుంటున్నారా అని చంద్రబాబు ప్రశ్నించారు. పదే పదే గదుల అద్దె ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించారాయన సామాన్యులకు శ్రీవారి దర్శనం ఎందుకు భారంగా మార్చుతున్నారని, తిరుమల కొండను భక్తులకు దూరం చేయాలనుకుంటున్నారా? అని బాబు ప్రశ్నించారు. అద్దెలు 1,100 శాతం పెంచడం వెనుక మీ ఉద్దేశం ఏంటని చంద్రబాబు ట్విటర్‌ ద్వారా ప్రశ్నించారు. కలియుగ వైకుంఠం విషయంలో అహంకారం వద్దని చంద్రబాబు హితవు పలికారు. భక్తుల మనోభావాలు గుర్తించాలని టీటీడీని కోరారు.


Tags:    

Similar News