CM Jagan: ఇవాళ గొల్లపల్లిలో దిశ యాప్‌ అవగాహన కార్యక్రమం

CM Jagan: పాల్గొననున్న సీఎం జగన్‌ * దిశ యాప్‌పై స్వయంగా అవగాహన కల్పించనున్న సీఎం జగన్

Update: 2021-06-29 01:54 GMT
సీఎం జగన్ (ఫైల్ ఫొటో)

CM Jagan: మహిళల భద్రత, రక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న దిశయాప్‌ వినియోగంపై ఇవాళ అవగాహన కల్పించనున్నారు సీఎం జగన్. ఇప్పటికే దిశ అవేర్‌నెస్‌పై రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టగా.. అందరూ యాప్ డౌన్‌లోడ్‌ చేసుకునేలా మహిళల్లో అవగాహన కల్పించాలని అత్యున్నత స్థాయి అధికారులను ఆదేశించారు. ఇవాళ తానే స్వయంగా యాప్‌‌పై అవగాహన కల్పించనున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు విజయవాడలోని గొల్లపూడిలో జరిగే అవగాహన కార్యక్రమానికి సీఎం హాజరవనున్నారు.

మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు, ఇతరత్రా నేరాల నివారణకు ఏపీ ప్రభుత్వం దిశ యాప్‌ను తీసుకు వచ్చింది. దిశయాప్‌ను ఇప్పటికే 16 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. యువతులు, మహిళలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరాన్ని సీఎం జగన్‌ వివరించనున్నారు. దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే విధానం.. ఆపద సమయంలో ఎలా ఉపయోగించాలనే విషయంపై ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థినులు, యువతులు, మహిళలు వర్చువల్‌ విధానంలో పాల్గొంటారు.

దిశ యాప్‌లో అత్యవసర సహాయం కోసం ఎస్‌ఓఎస్ అనే బటన్‌‌ ప్రత్యేకంగా రూపొందించారు. ఆపదలో ఉన్న సమయంలో ఆ బటన్‌ నొక్కితే వారి ఫోన్‌ నంబర్, ఆ సయంలో ఉన్న ప్రదేశం సహా మొత్తం సమాచారం దిశ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కి చేరుతుంది. విపత్కర పరిస్ధితుల్లో దిశయాప్‌ను ఓపెన్‌ చేసేందుకు తగిన సమయం లేకపోతే, ఫోన్‌ను అటూ ఇటూ ఊపినా.. సందేశాన్ని వెసులుబాటు కల్పించారు. ఈ యాప్‌లో ఐదుగురి నెంబర్లు ఫీడ్ చేసుకునే ఆప్షన్ ఉండగా.. ఆపద సమయంలో బటన్ నొక్కితే పోలీసులతో పాటు ఆ ఐదుగురికి వెంటనే సమాచారం అందుతుంది. ఇలా మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశ యాప్‌ వివరాలను, డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తారు సీఎం జగన్.

Tags:    

Similar News