Mekathoti Sucharita: మహిళల భద్రత కోసమే దిశ చట్టం

Mekathoti Sucharita: మహిళల భద్రత విషయంలో పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటున్నారని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు.

Update: 2021-08-17 11:19 GMT

Mekathoti Sucharita: మహిళల భద్రత కోసమే దిశ చట్టం

Mekathoti Sucharita: మహిళల భద్రత విషయంలో పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటున్నారని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. మహిళల రక్షణే మా ప్రథమ కర్తవ్యమని హోంమంత్రి అన్నారు. దిశ చట్టం కింద ఏడు రోజుల్లోనే ఛార్జిషీట్ నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. గుంటూరులో రమ్య హత్యకేసు నిందితుడిని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇతర రాష్ర్టాలు కూడా దిశ చట్టాన్ని ఆదర్శంగా తీసుకున్నాయని హోంమంత్రి సుచరిత చెప్పారు.

ఆసుపత్రి వద్ద లోకేష్‌ వ్యవహరించిన తీరు సరికాదన్నారు. సీఎం జగన్ మానవత్వంతో బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం చేశారన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలపై ఎన్నో దాడులు జరిగాయి. గతంతో పోలిస్తే నాలుగు రెట్లు మహిళలపై అఘాయిత్యాలు తగ్గాయి. సీఎం జగన్ పాలనలో మహిళలకు భరోసా ఏర్పడింది. సీఎం జగన్‌ పాలనలో దళితులు గౌరవం పొందుతున్నారని హోంమంత్రి సుచరిత అన్నారు.

Tags:    

Similar News