Andhra News: ఏపీలో చర్చనీయాంశమైన జీవో నంబర్ వన్ కేసు

Andhra News: గట్టిగా వాదించిన అడ్వొకేట్లు రాజు రాంచందర్, జంధ్యాల రవిశంకర్

Update: 2023-01-25 04:30 GMT

Andhra News: ఏపీలో చర్చనీయాంశమైన జీవో నంబర్ వన్ కేసు

Andhra News: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైన జీవో నంబర్ వన్ పై వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. సుప్రీం కోర్టు సూచనల మేరకు జీవో నెంబర్‌-1పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. రెండు రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన విచారణలో ప్రధాన పిటిషనర్‌ సహా అనుబంధంగా దాఖలైన పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం ఇరువర్గాల వాదనలు విన్నది. మరోవైపు ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో ఈ జీవోను తెచ్చామనే విషయాన్ని అడ్వొకేట్ జనరల్‌ కోర్టు ముందు ఉంచారు. సుప్రీం సీనియర్‌ న్యాయవాదులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీపీఐ రామకృష్ణ తరపున సీనియర్‌ న్యాయవాది రాజు రామచందర్‌ వస్తే టీడీపీ తరపున మరో సీనియర్‌ న్యాయవాది ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది లూత్రా వచ్చారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ తరపున సీనియర్‌ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌, గిడుగు రుద్రరాజు వాదనలు వినిపించారు.

ఇదే తరహా జీవోలు ఏమైనా ఉన్నాయా? వాటి సారాంశం ఏమిటీ? అనే అంశాలను ధర్మాసనం ముందుంచారు పిటిషనర్ల తరపున న్యాయవాదులు. వైఎస్‌ హయాంలో సభలు సమావేశాలు రోడ్ షోలకు సంబంధించి జారీ చేసిన సర్కులర్‌ అత్యంత పక్బండదీగా ఉందని దాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ తప్పు పట్టలేదని హైకోర్టు సీజే బెంచ్‌ ముందు వాదనలు వినిపించారు సీనియర్‌ కౌన్సిల్‌ జంధ్యాల. అలాగే గతంలో రోడ్‌ షోలు సభలు సమావేశాలు ఏ విధంగా జరిగేవనే అంశాలను వాదనల రూపంలో పిటిషనర్ల తరపు న్యాయవాదులు వివరించారు. ఇక ఈ తరహా జీవో వల్ల పౌరుల ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన కలిగినట్టు అవుతుందనే రీతిలో హైకోర్టు ధర్మాసనం ఎదుట వివరించారు.

ఇక ప్రభుత్వం తరపు అడ్వొకేట్ జనరల్ శ్రీరాం సుబ్రమణ్యం వాదనలు గట్టిగానే వినిపించారు. కందుకూరు, గుంటూరు ఘటనల తర్వాత జీవో నెంబర్‌-1 జారీ చేశామని వెల్లడించారు. జీవో నెంబర్‌-1లో ఎక్కడా సభలు సమావేశాల మీద నిషేధం ఎక్కడా విధించలేదని స్పష్టం చేశారు. జీవో నెంబర్‌ 1 వల్ల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందనే వాదనల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని ధర్మాసనం ఎదుట వాదించారు. ఇరుకు రోడ్లల్లో సభలు పెడితే ప్రజలకు ఇబ్బందని అలాగే వారి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుంది కాబట్టే ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో పెట్టుకోవాలని సూచిస్తూనే జీవో జారీ చేశారని స్పష్టం చేశారు.

Tags:    

Similar News