Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

Indrakeeladri: శ్రీమహిషాసుర మర్దినీదేవి దర్శనార్ధం క్యూలైన్లలో బారులు

Update: 2023-10-23 09:20 GMT

Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీ మహిషాసుర మర్దినీ దేవి దర్శనార్ధం క్యూలైన్లలో బారులు తీరాలు భక్తులు. వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధానం వరకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. అమ్మవారి దర్శనానికి మరో 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేశారు ఆలయ అధికారులు. రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు పూర్ణాహుతితో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి.

Tags:    

Similar News