Tirupti: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు..14కౌంటర్ల ద్వారా టోకెన్ల జారీ
Tirupti: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
Tirupti: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు..14కౌంటర్ల ద్వారా టోకెన్ల జారీ
Tirupti: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి భక్తులకు ఫ్రీగా అందించే ఎస్ఎస్ డీ టోకెన్ల జారీకి ఉన్న 10 కౌంటర్లతోపాటు అదనంగా మరో నాలుగు కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా 14 కౌంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తుల కోసం 5 కౌంటర్లను కేటాయించారు. వారి దివ్యదర్శనం టోకెన్లు శుక్రవారం సాయంత్రం 5గంటల నుంచి అందించారు.
మిగిలిన 9 కౌంటర్లలో సర్వదర్శన టోకెన్లు అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో భక్తులు మధ్యాహ్నం 12గంటల నుంచే క్యూలైన్లోకి చేరుకుంటున్నారు. శుక్రవారం వర్శంలో తడుస్తూనే టోకెన్ల కోసం కౌంటర్ల దగ్గర భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్ల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.