Vijayawada: కనకదుర్గమ్మ కాత్యాయినీ రూపంలో భక్తులకు దర్శనం
ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీ కనకదుర్గమ్మ కాత్యాయినీ రూపంలో భక్తులకు దర్శనం దర్శనానికి భారీగా తరలి వచ్చిన భక్తులు అధికారుల ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి
Vijayawada: కనకదుర్గమ్మ కాత్యాయినీ రూపంలో భక్తులకు దర్శనం
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మను కాత్యాయనీ దేవి అలంకారంలో దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడుతోంది.
భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. కాత్యాయనీ దేవి దర్శనం కోసం ఇంకా భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు.