Devineni Avinash: టీడీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు
Devineni Avinash: టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది
Devineni Avinash: టీడీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు
Devineni Avinash: విజయవాడ తూర్పు నియోజకవర్గం తారకరామానగర్‌లో జరిగిన వైసీపీ, టీడీపీ కార్యకర్తల ఘర్షణపై దేవినేని అవినాష్ స్పందించారు. దాడి చేసిన వారే ఫిర్యాదు చేయడం వింతగా ఉందన్నారు. టీడీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ తనకు సీటు ఖరారు చేశాకే కుట్రలు చేస్తున్నారన్నారు. టీడీపీకి ఓటమి భయం పట్టుకున్నందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. సౌమ్యుడిగా చెప్పుకునే గద్దె రామ్మోహన్ నీచ రాజకీయాలు చేస్తున్నారన్న ఆయన ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.