సీఎం పదవికి ఫడ్నవిస్ రాజీనామా.. బలపరీక్షకు ముందే చేతులెత్తేసిన ఫడ్నవిస్‌

Update: 2019-11-26 10:12 GMT

రేపటి బలపరీక్షకు ముందే మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేసిన తర్వాత రెండు గంటల్లోనే దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన రాజీనామాను దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మెజారిటీ ఇచ్చారని, అయితే, శివసేన బీజేపీని మోసం చేసిందని ఫడ్నవీస్ ఆరోపించారు. శివసేన పార్టీ ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా వ్యవహరించిందన్నారు.

Tags:    

Similar News