Pawan Kalyan: కోనసీమ జిల్లా రాజోలులో డిప్యూటీ సీఎం పవన్‌ పర్యటన

Pawan Kalyan: ఇవాళ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.

Update: 2025-11-26 06:23 GMT

Pawan Kalyan: కోనసీమ జిల్లా రాజోలులో డిప్యూటీ సీఎం పవన్‌ పర్యటన

Pawan Kalyan: ఇవాళ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరి రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు ఆయన చేరుకుంటారు. అనంతరం.. అక్కడి నుంచి హెలికాప్టర్ లో మలికిపురం మండలం గూడపల్లి హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు. కేశనపల్లిలో సముద్ర జలాల ప్రభావంతో నాశనమైన లక్షలాది కొబ్బరి చెట్లను పరిశీలించి.. బాధిత రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు.

కేశనపల్లి నుంచి రోడ్డుమార్గాన రాజోలు మండలం శివకోటిలోని సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం హెలికాప్టర్ లో రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు బయల్దేరి వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం పవన్.

Tags:    

Similar News