కోవిడ్ నియంత్రణ.. ఆవిరి యంత్రాలకు పెరిగిన డిమాండ్ !

Update: 2020-09-04 04:51 GMT

కరోనా నేపథ్యంలో ఆవిరి యంత్రాలకు రోజు రోజుకి డిమాండ్‌ పెరిగిపోతోంది. వైరస్ నియంత్రణలో నీటి ఆవిరి ఎంతగానో ఉపయోగకరిస్తుందని ప్రచారం ఎక్కువ కావడంతో చాలామంది స్టీమర్లను కొనడానికి షాపుల ముందు క్యూ కడుతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో కొన్ని షాపుల్లో స్టీమర్లు దొరకకపోవడంతో ఆన్ లైన్ లో కోనుగోలు చేస్తున్నారు. విశాఖ జిల్లాలోను రోజు రోజుకి కరోనా కేసులు పెరగడంతో నగర ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వైరస్ రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. వైరస్ నియంత్రణలో నీటి ఆవిరి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులతో పాటు సోషల్ మీడియాలోను, ఇతర ప్రచారమాధ్యమాలలోను ప్రచారం ఎక్కువగా జరగడంతో ఆవిరి యంత్రాలను కొనుగోలు చేయడానికి నగర ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

కొవిడ్‌ ముందు స్టీమర్లు మార్కెట్‌లో అందుబాటు ధరలో ఉండేవి. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో వాటికి భారీగా డిమాండ్‌ పెరగడంతో కొంతమంది ధరలు పెంచి అమ్ముతున్నారు. ప్రతి ఒక్కరూ ఆవిరి పట్టుకోవడం ద్వారా కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండొచ్చన్న ఆలోచనతో స్టీమర్స్ ను కొనుగోలు చేస్తున్నారు. వైరస్ నియంత్రణలో నీటిని అవిరి ఎంతగానో ఉపయోగ పడుతుందని, అందుకే స్టీమర్లను కొనుగోలు చేస్తున్నామని కొనుగోలు దారులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ మహమ్మారి బారిన పడకుండా తీసుకునే జాగ్రత్తల్లో ముఖ్యమైనది ఆవిరి పట్టడం కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఈ విధానం వాస్తవానికి పాతది అయినా, కరోనా నేపధ్యంలో కొంత వైద్యులు ఈ విధానాన్ని కూడా సూచిస్తున్నారు.

Tags:    

Similar News