DD Saptagiri Channel Starts Live online classes: ఏపీ విద్యార్థులకు డీడీ సప్తగిరిలో ఆన్ లైన్ క్లాసులు..ఎప్పటినుంచి అంటే..

DD Saptagiri Channel Starts Live online classes: కరోనా ఎఫెక్ట్ తో విద్యార్ధుల విద్యాసంవత్సరం పూర్తిగా నాశనం అయిపొయింది.

Update: 2020-07-10 11:45 GMT

DD Saptagiri Channel Starts Live online classes: కరోనా ఎఫెక్ట్ తో విద్యార్ధుల విద్యాసంవత్సరం పూర్తిగా నాశనం అయిపొయింది. విద్యార్థులు స్కూలుకు వెళ్లి చదువుకునే పరిస్థితి లేదు. చదువు చెప్పడానికి బడులు తెరవగలిగే అవకాశమూ ప్రభుత్వాలకు లేదు. రోజువారీ పనులే సంకట స్థితిలో ఉన్న పరిస్థితి. ఇక పిల్లల చదువులు ఎలా అనే ఆందోళనలో తల్లిదండ్రులు ఉన్నారు. ఈ నేపధ్యంలో విద్యార్థులకు ఇంటివద్దే వుండి చదువుకునే అవకాశం కల్పించడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఈనెల 13 వ తేదీ నుంచి దూరదర్శన్ ద్వారా పాఠాలు ప్రసారం చేయడానికి సన్నాహాలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1 వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థులకు 020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 13వ తేదీ నుంచి దూరదర్శన్ ఛానల్ ద్వారా వీడియో పాఠాలను సబ్జెక్ట్ నిపుణులతో బోధించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఉదయం 11 గంటల నుంచి 12 వరకు 1, 2 తరగతులు విద్యార్థులకు, మధ్యాహ్నం 12-1 గంట వరకు 3,4,5 తరగతుల విద్యార్థులకు వీడియో పాఠాలు బోధించనున్నారు. అలాగే మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు 6,7వ తరగతి విద్యార్థులకు, సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు 8,9 తరగతుల విద్యార్థులకు వీడియో క్లాసులు తీసుకోనున్నారు. ఇక పదో తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు లాంగ్వేజ్ క్లాసులు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు మిగిలిన సబ్జెక్టులకు సంబంధించిన వీడియో పాఠాలను ప్రసారం చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ వీడియో పాఠాలు నెలాఖరు దాకా ఉంటాయి. ఈ విషయాన్ని విద్యార్ధులకు తెలియచేయాలని అధికారులు అన్ని స్కూళ్ళ ప్రిన్సిపాళ్లకు, టీచర్లకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.   

Tags:    

Similar News