తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
Eluru District: తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు, ఏలూరు జిల్లా కొత్తపేట డివిజన్‌లో ఘటన
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
Eluru District: అనారోగ్యంతో తండ్రి మృతి చెందగా.. కూతురే అన్ని తానై ముందు నడిచింది. తండ్రి చితికి తలకొరివి పెట్టింది. ఏలూరు కొత్తపేట 42వ డివిజన్‌లో నివాసముంటున్న సమతం రాంబాబు అనారోగ్యంతో కన్నుమూశాడు. మూడు నెలల క్రితం రాంబాబు కుమారుడు కూడా అనారోగ్యంతోనే కన్నుమూశాడు. వారసుడు లేకపోవడం, తలకొరివి పెట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కుమార్తె రాధ, తండ్రి అంత్యక్రియలు నిర్వహించింది.