విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు!

Vijayawada Indrakeeladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకొని భారీగా తరలివస్తున్నారు. క

Update: 2020-10-17 09:20 GMT

Vijayawada Indrakeeladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకొని భారీగా తరలివస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. భక్తులను పరిశీలించిన తర్వాతే ఆలయం లోపలికి అనుమతిస్తున్నారు సిబ్బంది.. దసరా సందర్భంగా కనకదుర్గ అమ్మవారిని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దర్శించుకున్నారు. అనంతరం తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోని ఏర్పాట్లన్నీ సంతృప్తికరంగానే ఉన్నాయని అన్నారు.

ఇక తొమ్మిది రోజుల పాటు జరిగే దసరా నవరాత్రి ఉత్సవాలలో ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మొత్తం 9 రోజుల్లో దుర్గమ్మ 10 అలంకారాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఏ రోజు ఏ అలంకరణతో భక్తులకు దర్శనం ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే వైదిక కమిటీ ఫైనల్ చేసింది.

ఇక దసరా రోజు సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం జరగనుంది. అయితే ఈ తెప్పోత్సవానికి సైతం పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించనున్నారు. మొత్తంగా గతంలో ఎన్నడూ లేని విదంగా ఈసారి దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు..

Tags:    

Similar News