Kurichedu incident updates : దయచేసి ఎవరూ శానిటైజర్‌ తాగవద్దు..

Update: 2020-07-31 13:16 GMT

కురిచేడు ఘటనపై దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ద్రిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కురిచేడు మండల కేంద్రంలో శానిటైజర్ తాగి త్రీవ అస్వస్థతకు గురై హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన వారి మృతుదేహాలను సందర్శించి నివాళులు అర్పించారు, వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మద్దిశెట్టి.. మద్యానికి బానిసై కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. దయచేసి ఎవరూ శానిటైజర్లు తాగవద్దని అన్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పి గారితో చర్చించారు, పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పోలీస్ శాఖ వారిని ఆదేశించారు. ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ మార్చురీ వద్ద మృతదేహాలను పరిశీలించారు.

కాగా మద్యానికి బానిసైన వ్యక్తులు మద్యనిషేధం, రేట్లు పెరగడం.. దానికి తోడు కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో కురిచేడులో పది రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో కొందరు స్థానికులు, యాచకులు శానిటైజర్ ను మద్యంగా భావించి సేవించారు.‌ ఈ ఘటనలో గురువారం అర్ధరాత్రి ముగ్గరు మరణించగా, శుక్రవారం మరో తొమ్మిది మంది ప్రాణాలు విడిచారు. దీంతో ఈ ఘటన పెద్ద సంచలనమైంది. ఘటనపై సీఎంఓ ఆరా తీసింది. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.    

Tags:    

Similar News