Cyclone Montha: మన్యం జిల్లాలో వానల ఉధృతి..ఒట్టిగెడ్డ రిజర్వాయర్ గేటు ఎత్తి నీటి విడుదల
Cyclone Montha: మొంథా తుపాన్ ప్రభావం మన్యం జిల్లా గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
మొంథా తుపాన్ ప్రభావం మన్యం జిల్లా గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం రావాడ ఒట్టిగెడ్డ రిజర్వాయర్ లో ఎగువున కురుస్తున్న వర్షాలకు నీటిమట్టం పెరిగింది.
దీంతో ఒక గేట్ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. డ్యాం కి దిగువున గల తూర్పు ముఠా ప్రాంతానికి వెళ్లే రహదారిపై నీరు అధికంగా ప్రవహిస్తుంది. అటుగా రాకపోకలు చేయొద్దని అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు..