Cyclone Montha: బాపట్ల జిల్లాలో మొంథా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు

Cyclone Montha: బాపట్ల జిల్లాలో మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2025-10-28 05:54 GMT

Cyclone Montha: బాపట్ల జిల్లాలో మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నివాసముంటున్న వారిని పట్టణంలోని ఆర్ట్స్ కాలేజ్ పునరావాస కేంద్రానికి తరలించారు అధికారులు. పట్టణంలో 20 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి తెలిపారు.

లోతట్టు ప్రాంత ప్రజలని ఈ పునరావాస కేంద్రాలకు తరలించినట్లు ఆయన తెలిపారు. వారికి కావాల్సిన టిఫిన్, భోజనము, మంచినీరు, వైద్య సదుపాయాలన్నీ ఏర్పాటు చేశామన్నారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని కమిషనర్ రఘునాథరెడ్డి తెలిపారు.   

Tags:    

Similar News