నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

Update: 2019-11-26 03:05 GMT

వైఎస్సార్ ఆదర్శం పథకం ద్వారా.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ. సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో నీలం సహానీ సమీక్ష నిర్వహించారు. ఇసుక, ఇతర నిత్యావసరాలు రవాణా చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. బ్యాంకు రుణాలతో పేదలకు వాహనాలు ఇచ్చే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనిపై త్వరలో సమగ్ర నివేదిక అందించాలని సంబంధిత అధికారులను సీఎస్‌ ఆదేశించారు.

కాగా నవ్యాంధ్రప్రదేశ్ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ నియమితులైన సంగతి తెలిసిందే. ఇన్‌చార్జి సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ నుంచి సహానీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందువరకు ఆమె కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.1984 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారిణి ఆమె. గతంలో నీలం సహానీ కృష్ణాజిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌గా, నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించి, అనంతరం కేంద్ర సర్వీసులకు వెళ్లారు. 

Tags:    

Similar News