CPI Narayana: సీపీఐ నారాయణకు సతీ వియోగం..
CPI Narayana: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ భార్య వసుమతి కన్నుమూశారు.
CPI Narayana: సీపీఐ నారాయణకు సతీ వియోగం..
CPI Narayana: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ భార్య వసుమతి కన్నుమూశారు. అనారోగ్యంతో తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొంత కాలంగా నారాయణ సతీమణి వసుమతి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నగరి సమీపంలోని ఐనంబాకంలో నారాయణ దంపతులు నివాసం ఉంటున్నారు. రేపు నగరి మండలం ఐనంబాకంలో వసుమతిదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమె మరణవార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.