Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన
Andhra Pradesh: బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ కోసం పోటెత్తిన మహిళలు
ప్రకాశం జిల్లాలో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన (ఫైల్ ఇమేజ్)
Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగన్న చేయూత పథకం లబ్దిదారులు బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ లింక్ తప్పని సరి చేయడంతో మహిళలు బ్యాంకులకు క్యూ కట్టారు. అద్దంకి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ కు మహిళలు పోటెత్తారు. కరోనా నిబంధనలు పాటించ కుండా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్ జూన్ 8 చివరి తేది కావడంతో అద్దంకి నియోజకవర్గంతో పాటు గుంటూరు జిల్లా వినుకొండ నుండి కూడా మహిళలు తరలి వచ్చారు.
మహిళలను అదుపు చేయడంలో పోలీసులు, బ్యాంకు అధికారులు చేతులెత్తేశారు.ప్రభుత్వం అద్దంకిలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుకు మాత్రమే జగనన్న చేయూత పథకానికి అనుమతులు ఇవ్వడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర బ్యాంకులు, సచివాలయాలకు లింక్ చేసే విధంగా అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలతో పనులు మానుకొని బ్యాంకు దగ్గరే పడిగాపులు కాయాల్సిన వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ క్యూ లైన్లో నిల్చున్న పలువురు సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితి దాపురించిందంటూ మండిపడుతున్నారు.