Coronavirus Positive: కొవిడ్ టెస్టులు చేయకుండానే పాజిటివ్.. ఖంగుతిన్న యువకుడు..

Coronavirus Positive: ప్రపచవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. ఇక మనదేశం కూడా ప్రతాపం చూపిస్తుంది.

Update: 2020-06-29 12:00 GMT

Coronavirus Positive: ప్రపచవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. ఇక మనదేశం కూడా ప్రతాపం చూపిస్తుంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇన్నాళ్లు కరోనాను తేలికగా తీసుకున్న ప్రజలు.. ఇప్పుడు పెరుగుతున్న కేసులను చూసి హడలేతిపోతున్నారు. మళ్లీ లాక్‌డౌన్ విధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు ప్రభుత్వాస్పత్రుల్లో కరోనా రోగులకు అందుతున్న చికిత్స, పరీక్షా విధానాలపై ఇప్పటికే ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. అసలు కోవిడ్ పరీక్షలు చేయకుండానే కరోనా పాజిటివ్ వచ్చిందని ఓ యువకుడికి వైద్య సిబ్బంది సమాచారం ఇచ్చారు. దాంతో అశ్యువకుడు ఖంగుతిన్నాదు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అసలు పరీక్షలే చేయలేదు. కరోనా సోకిందని ఎలా చెబుతారంటూ ప్రశ్నించాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలంలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. కొత్తూరు గ్రామానికి చెందిన 28 ఏళ్ల యువకుడు జ్వరంగా ఉందని ఈ నెల కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయమని వైద్యులను కోరాడు. అయితే కేవలం వివరాలు నమోదు చేసుకొని.. కరోనా పరీక్ష ఎప్పుడు చేస్తామనేది ఫోన్ చేసి చెబుతామని ఇంటికి పంపించారు. ఆ తర్వాత ఎవరూ ఫోన్ చేయలేదు. అయితే శనివారం పీహెచ్‌సీ సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి కరోనా పాజిటివ్ అని చెప్పారు. దీంతో యువకుడు షాక్ తిన్నాడు. తనకు అసలు కరోనా పరీక్షలే చేయలేదని వాపోయాడు. దీనిపై వేట్లపాలెం వైద్యాధికారిణి ధనలక్ష్మికి ఫిర్యాదు చేశాడు. ఈ సమస్య జీజీహెచ్ సూపరింటెండెంట్ రాఘవేంద్రరావు దృష్టికి వెళ్లింది. అయితే సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి.

ఏపీలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 706 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 30,216 శాంపిల్స్‌ని పరీక్షించగా 706 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 302 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.  

Tags:    

Similar News