Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 9, 544 పాజిటివ్ కేసులు..
Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.
Representational Image
Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 9,544 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 55,010 శాంపిల్స్‌ని పరీక్షించగా 9,544 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 8,827 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 91 మంది ప్రాణాలు కోల్పోయారు.
చిత్తూరు జిల్లా 16, పశ్చిమ గోదావరి జిల్లా 13, నెల్లూరు జిల్లా 12, తూర్పు గోదావరి జిల్లా 11, అనంతపురం జిల్లా 08, కడప జిల్లాలో 07, విశాఖపట్నం జిల్లా 06, శ్రీకాకుళం జిల్లా 05, ప్రకాశం జిల్లా 04, గుంటూరు జిల్లా 03, కర్నూలు జిల్లా 03, కృష్ణ జిల్లా 03, కరోనా బారిన పడి మరణించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 3,34,940. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 3,092. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా 46,668 కర్నూల్ జిల్లా 37, 300 అనంతపురం జిల్లా 33, 307 కేసులు నమోదు.
ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,44,045 కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 87,803 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 55,010 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు మొత్తంగా 31,29,857 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.