Corona Updates in Andhra Pradesh: ఏపీలో కొన‌సాగుతున్న క‌రోనా ఉధృతి.. కొత్తగా 8,012 కేసులు

Corona Updates in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభన కొన‌సాగుతూనే ఉంది. టెస్టులు పెంచిన‌ కొద్దీ పాజిటివ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి.

Update: 2020-08-16 14:14 GMT
Corona Updates in Andhra Pradesh

CoronaUpdates In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభన కొన‌సాగుతూనే ఉంది. టెస్టులు పెంచిన‌ కొద్దీ పాజిటివ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. కాగా, అదే సమయంలో రికవరీ కేసులు కూడా పెరుగుతుండ‌టం కొంత ఊర‌ట నిచ్చే విష‌యం. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8012 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,89,829కు చేరింది. ఇందులో 85,945 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,01,234 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 88 మంది మరణించగా .. దీంతో మృతుల సంఖ్య 2650కు చేరింది. అటు గడిచిన 24 గంటల్లో 10,117 మంది కరోనాను జయించారు.

ఇక జిల్లాల వారీగా పాజివిట్ కేసుల వివ‌రాలు.. అనంతపురంలో 580, చిత్తూరులో 981, తూర్పు గోదావరిలో 875, గుంటూరులో 590, కడపలో 286, కృష్ణాలో 263, కర్నూలులో 834, నెల్లూరులో 423, ప్రకాశంలో 614, శ్రీకాకుళంలో 773, విశాఖలో 512, విజయనగరంలో 388, పశ్చిమ గోదావరిలో 893 కేసులు నమోదయ్యాయి.

గ‌డిచిన 24 గంట‌ల్లో కరోనా కారణంగా.. చిత్తూరులో10 మంది, తూర్పుగోదావరిలో 10 మంది, కర్నూలులో 9 మంది, నెల్లూరులో 9 మంది, అనంతపురంలో 8 మంది, పశ్చిమ గోదావరిలో 8 మంది, విశాఖపట్నంలో ఏడుగురు, గుంటూరు లో ఆరుగురు, కడపలో ఆరుగురు, ప్రకాశంలో న‌లుగురు, శ్రీకాకుళంలో న‌లుగురు, విజయనగరంలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు మరణించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 28.60 లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 

Tags:    

Similar News