తూర్పుగోదావరి జిల్లాలో కలవరపెడుతున్న కరోనా.. 10మంది పోలీసులకు కరోనా...

East Godavari - Coronavirus: మాస్కులు ధరించడం, సోషల్ డిస్టన్స్ పాటించాలని సూచనలు...

Update: 2021-11-03 04:34 GMT

తూర్పుగోదావరి జిల్లాలో కలవరపెడుతున్న కరోనా.. 10మంది పోలీసులకు కరోనా...

East Godavari - Coronavirus: కరోనా మహమ్మారి మరోసారి తూర్పుగోదావరి జిల్లాను కలవరపెడుతోంది. కోవిడ్ రెండు దశల్లో జిల్లాలో రికార్డు స్థాయిలో నమోదయిన పాజిటివ్ కేసులు.. మరణాలు పెను విషాదాన్ని నింపాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినా తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ముడంకెల్లో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి.

రెండు దశల్లోనూ దాదాపు మూడు లక్షలకు చేరువగా జనం కోవిడ్ బారిన పడ్డారు. సుమారు 13 వందలకు చేరువగా కోవిడ్ బాధితులు మృత్యవాతపడ్డారు. సెకండ్ వేవ్ కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

తాజాగా కోనసీమ ప్రాంతంలో ఇటీవల నమోదయిన కరోనా పాజిటివ్ కేసులు కలవరానికి గురిచేస్తున్నాయి. అమలాపురం సబ్ డివిజన్ పరధిలో ఇటీవల 10 మంది పోలీసులకు కరోనా సోకింది. దసరా ఉత్సవాలు, కోనసీమలో జరిగిన బేతాళ స్వామి సంబరాలతో పాటు.. అధికార వైసిపి.. ప్రతిపక్ష టిడిపి చేపట్టిన ఆందోళనల్లో బందోబస్తు విధులు నిర్వహించిన ఒక సిఐ.. ఐదుగురు ఎస్ఐ లతో సహా మరో నలుగురు కానిస్టేబుల్స్ కరోనా బారినపడ్డారు.

కోవిడ్ ఫస్ట్ వేవ్‌లో తీసుకునన్ని జాగ్రత్తలు సెకండ్ వేవ్ సమయంలో పాటించకపోవడంతోనే నష్టం జరిగిందని సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ పై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా యువత, విద్యార్ధులు కోవిడ్ ప్రోటోకాల్ పాటించడంలో ఏ మాత్రం అలసత్వం వహించినా ఇబ్బందులు తప్పవు. మరోవైపు పండుగలు, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనల మేరకే వాటిని నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది.

ఇక ప్రైవేట్ విద్యాసంస్థలు దాదాపు మూతపడే పరిస్థితి ఉత్పన్నమయ్యింది. విద్యార్ధులు దాదాపు రెండేళ్ల పాటు పుస్తకాలకే దూరం అయ్యారు. అన్‌లైన్ క్లాసులు ప్రారంభించినా.. కొన్ని ప్రాంతాల్లో అందుకు అనుకూలమైన పరిస్థితులు లేక సవ్యంగా సాగలేదు. రోజువారీ కూలీ నుంచి పెద్ద వ్యాపారులు సైతం కరోనా ఎఫెక్ట్‌తో ఆర్థికంగా నష్టపోయారు.

Tags:    

Similar News