Coronavirus Pandemic: ఏపీలో కరోనా కట్టడికి కియా మోటార్స్ భారీ విరాళం
Coronavirus Pandemic: కోవిడ్–19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్ధ (ఏపీఎస్‌డిఎంఏ)కి రూ.5 కోట్ల విరాళం అందించింది కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.
Coronavirus Pandemic: ఏపీలో కరోనా కట్టడికి కియా మోటార్స్ భారీ విరాళం
Coronavirus Pandemic: కోవిడ్–19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్ధ (ఏపీఎస్‌డిఎంఏ)కి రూ.5 కోట్ల విరాళం అందించింది కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. విరాళానికి సంబంధించిన నిధులను వైద్య పరికరాల కొనుగోలు (ఆక్సీజన్ కాన్సెన్‌ట్రేటర్స్, వెంటిలేటర్స్, క్రయోజనిక్ ట్యాంకర్లు తదితర అవసరాలు) కు వినియోగించాలని కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు కోరారు.
నెఫ్ట్ ద్వారా బదిలీ చేసిన విరాళానికి సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌కు కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, సీఈవో కుక్ హ్యున్ షిమ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లీగల్, కార్పొరేట్ ఎఫైర్స్ హెడ్ జ్యూడ్‌లి, కియా ఇండియా ప్రిన్సిపల్ అడ్వైజర్ డాక్టర్. టి.సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.