శ్రీహరి కోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రంపై కోవిడ్ ప్రభావం

Update: 2020-08-22 07:29 GMT

Coronavirus Effect on ISRO: భారత అంతరిక్ష ప్రయోగకేంద్రం షార్ పై కరోనా వైరస్ మహమ్మారి ప్రత్యక్ష ప్రభావం పడింది. తొలిసారిగా ఈ విపత్తు శ్రీహరి కోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రంను కట్టడి చేసింది. శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌ లో కార్యకలాపాలకు ఇస్రో లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో షార్ లో ప్రతి రోజూ నిర్వహించే కార్యకలాపాలు తాత్కాలికంగా స్తంభించాయి.

కరోనా మహమ్మారి ఆఖరికీ షార్ ను కూడా విడిచిపెట్టలేదు. షార్ తో పాటు చుట్టూపక్కల సరిసరాల్లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో SDSCలో లాక్ డౌన్ ప్రకటించారు. కరోనాను కట్టడిచేసేందుకు ముందు జాగ్రత్త కోసం కార్యాలయ పరిసరాల్లో ఫ్యుమిగేషన్, శానిటైజేషన్ చేయించవలసి ఉంది. ఈ చర్యల కోసం కార్యకలాపాలన్నిటినీ తాత్కాలికంగా నిలిపేయాలని నిర్ణయించినట్లు షార్ వెల్లడించింది.

శ్రీహరికోట రాకెట్ లాంచ్ స్టేషన్‌లో ముఖ్యమైన కార్యకలాపాలను నిర్వహించేందుకు అతి తక్కువ మంది సిబ్బంది మాత్రమే పని చేస్తారని షార్ పేర్కొంది. అత్యవసర సేవల విభాగం మినహా మిగిలిన ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ హోం చేయాలని పేర్కొంది. మరోవైపు పులికాట్ నగర్ లోని షార్ ఎంప్లాయీస్ కాలనీలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో పూర్తి లక్డౌన్ ఆంక్షలు విధించారు. మొత్తానికి తొలిసారిగా కరోనా మహమ్మారితో షార్ లో కార్యకలాపాలు పూర్తిగా స్థంభించిపోయాయి. దీని ప్రభావం వల్ల ఇస్రో ముందుగా నిర్ణయించిన రాకెట్ ప్రయోగాల షెడ్యూల్ లో పెను మార్పులు చోటు చేసుకొనే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News