Corona: చిత్తూరు జిల్లాలో కరోనా ప్రమాద ఘంటికలు

Corona: గతేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా చిత్తూరు జిల్లాలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.

Update: 2021-04-22 02:30 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Corona: చిత్తూరు జిల్లాలో కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గతేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా చిత్తూరు జిల్లాలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో సరాసరి 37లక్షల జనాభా ఉంటే అందులో 2020 మార్చి నుండి ఇప్పటి వరకు ఒక లక్షా ఆరు వేల కేసులు నమోదయ్యాయి.అన్ని జిల్లాలలో మృత్యువాత పడిన వారి సంఖ్య 750 వరకు ఉంటే , ఒక్క చిత్తూరు జిల్లాలోనే 927 మంది మరణించారు.

చిత్తూరు జిల్లాలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే సగం కేసులు తిరుపతిలోనే నమోదౌతున్నాయి. కరోనా వ్యాప్తితో తిరుపతివాసులు భయాందోళన చెందుతున్నారు. యాత్రికులు ఒక వైపు మరోవైపు స్థానికుల నిర్లక్ష్యంతో కేసుల సంఖ్య పెరుగుతుంది. టిటిడి రోజువారి తిరుమలకు అనుమతించే భక్తులను టీటీడీ సంఖ్యను తగ్గించింది. మహారాష్ట్ర నుంచి వస్తున్నవారిని థర్మల్ స్కీృనింగ్ టెస్ట్ చేస్తున్నారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆసుపత్రులలో పడకల సామర్థ్యం పాటు కోవిడ్ కేర్ సెంటర్ల పెంచారు. తిరుపతి స్విమ్స్, రుయా, చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రి, మదనపల్లె, కుప్పం, శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రులలో మొత్తం 1,929 పడకలు అందుబాటులో తెచ్చారు. వీటితో పాటు 26 ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1,480 బెడ్లుకు అనుమతిచ్చారు.

కోవిడ్ కేర్ సెంటర్లకు సంబంధించి 3 కోవిడ్ కేర్ సెంటర్లైన పద్మావతి నిలయం, విష్ణు నివాసం, ఆర్ వి ఎస్ మెడికల్ కాలేజీ లను పునః ప్రారంభించారు.ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ప్రమాద తీవ్రత తగ్గదని హెచ్చరిస్తున్నారు అధికారులు. కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని చెబుతున్నారు. టీకాలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

జిల్లాలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే సగం కేసులు తిరుపతిలోనే నమోదౌతున్నాయి. నగరంలో ఉన్న జనాభా కలవరపడుతున్నారు. యాత్రికులు,పర్యాటకులు ఒక వైపు కోవిడ్ ఆసుపత్రులు ఒక వైపు కనీస జాగ్రత్తలను పాటించకపోవడంతో అల్లుకుంటోంది. అప్రమత్తంగా ఉండకపోతే చాపకింద నీరులా ప్రాకుతున్న ఈ వైరస్ చాపలో చుట్టేస్తుంది. 

Full View


Tags:    

Similar News