దేశంలో చురుగ్గా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం

* కేవలం 21 రోజుల్లో 50 లక్షల మందికి వ్యాక్సిన్ * నిన్న ఒక్క రోజే 5,09,893 మందికి టీకాలు * ప్రపంచవ్యాప్తంగా 67 దేశాల్లో ప్రారంభమైన వ్యాక్సినేషన్ డ్రైవ్

Update: 2021-02-06 02:56 GMT

Representational Image

భారత్‌లో కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ భారత్‌లో వడివడిగా సాగుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 50 లక్షల మార్కును దాటింది. జనవరి 16న వ్యాక్సినేషన్‌ ప్రారంభమవ్వగా 20 రోజుల్లోనే 50 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. ప్రపంచంలో తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ ఇచ్చిన దేశంగా ఇండియా టాప్‌లో నిలిచింది.

నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 11వేల 814 కేంద్రాల్లో 5లక్షల 9వేల 893 మందికి టీకాలు వేశారు. మొత్తం 8 రాష్ట్రాల్లో దాదాపు 61 శాతం మందికి వ్యాక్సిన్ వేశారు. ఉత్తరప్రదేశ్‌లో 11.9 శాతం మందికి టీకా ఇచ్చినట్టు కేంద్రం పేర్కొంది.

ఇక తొలి డోసు తీసుకున్న వారికి ఫిబ్రవరి 13 నుంచి రెండో డోస్ ఇవ్వనున్నారు. జనవరి 16న తొలి డోస్ తీసుకున్నవారికి ముందుగా రెండో డోస్ ఇస్తారు. జులై నాటికి 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలన్న టార్గెట్ పెట్టుకుంది కేంద్రం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 67 దేశాల్లో వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. మొత్తం 7 వ్యాక్సిన్‌లకు ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి ఉంది. ఇప్పటివరకూ 11.90 కోట్ల మంది వ్యాక్సిన్ పొందారు. రోజూ 45 లక్షల మంది దాకా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. అమెరికాలో ఇప్పటివరకూ 3.67 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు.

Tags:    

Similar News