Corona Tests in Sanjeevini Mobile Labs in AP: సంజీవినిలో 10 నిమిషాల్లో ఫలితం.. ఏపీలో సంచార ల్యాబ్ ల్లో పరీక్షలు

Corona Tests in Sanjeevini Mobile Labs in AP: కరోనా తీవ్రరూపం దాల్చడంతో దానికి అనుగుణంగా పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Update: 2020-07-20 02:00 GMT

Corona Tests in Sanjeevini Mobile Labs in AP: కరోనా తీవ్రరూపం దాల్చడంతో దానికి అనుగుణంగా పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రారంభంలో కేవలం రాష్ట్రంలోనే ఐదు సెంటర్లలో ఉండే పరీక్షల ల్యాబ్ లన్నింటిని జిల్లా స్థాయికి విస్తరించారు. క్రమేణా కేసులు పెరుగుతుండటం, ఫలితం ఆలస్యం అవుతుండటంతో వీటిని డివిజన్లో ఉండే సమాజిక ఆస్పత్రికి విస్తరించారు. అయితే వీటిలో సైతం ప్రారంభంలో ర్యాపిడ్ టెస్ట్ మాత్రమే చేసేవారు. క్రమేణా ఇక్కడ కూడా ఐసీఎంఆర్ టెస్ట్ లు చేయడం, అక్కడక్కడే ఫలితం వెలువడటం జరుగుతోంది. ఇలా విస్తరించినా మరిన్ని కేసులు పెరుగుతున్న కారణంగా ఏపీ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ బస్సులను సంజీవిని సంచార ల్యాబ్ లుగా మార్చారు. ఇంద్ర బస్సులను తీసుకుని, లక్షల వ్యయంతో వీటిని ల్యాబ్ ల్లా మార్చారు. వీటిలో ఇంతవరకు ర్యాపిడ్ టెస్ట్ లు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇది నేరుగా అనుమానితులు ఉన్న ప్రాంతానికి వెళ్లి పరీక్షలు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు.

ఏపీలో చేస్తోన్న ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇదివరకు కరోనా పరీక్షకు సాంపిల్స్ ఇచ్చిన తర్వాత ఫలితాల కోసం మూడు రోజుల పాటు ఆగాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు 'సంజీవిని' సంచార ల్యాబ్‌లతో టెస్టు చేయించుకున్న తర్వాత పది నిమిషాల్లోనే ఫలితం వచ్చేస్తోంది.

రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి బాగా పెరిగిపోతున్న నేపధ్యంలో ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా డిపోల్లో ఉన్న ఇంద్ర బస్సులను 'సంజీవిని' పేరుతో కరోనా టెస్టింగ్ సెంటర్లుగా మార్చింది. వీటిల్లో ర్యాపిడ్ యాంటీ టెస్టింగ్ కిట్‌లను ఉపయోగించి వేగవంతంగా కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఈ బస్సుల్లో ఒకేసారి పది మందికి పరీక్ష చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనికి దాదాపు రూ. 3 లక్షలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. కాగా, కరోనా పరీక్ష, ఫలితాల వెల్లడి కేవలం 15 నిమిషాల్లోనే పూర్తవుతుంది.


Tags:    

Similar News