Anantapur: మడకశిరలో మానవత్వం చాటుకున్న పోలీస్ రమణ
Anantapur: ఓవికలాంగుడికి ఆసరగా నిలిచిన కానిస్టేబుల్ రమణ *వికలాంగుడిని పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకొచ్చిన కానిస్టేబుల్
Representational Image
Anantapur: అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమయంలో పోలీసులు మానవత్వం చాటారు. మడకశిర కానిస్టేబుల్ రమణ ఓవికలాంగుడికి ఆసరగా నిలిచాడు. ఓటు వేయడానికి వచ్చిన వికలాంగుడు నడవడానికి ఇబ్బంది పడుతుంటే కానిస్టేబుల్ రమణ చేయూతనిచ్చి పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకొచ్చాడు. పోలింగ్ సమయంలో భద్రతాపరమైన విధులే కాకుండా వృద్ధులకు, వికలాంగులకు పోలీసులు అండగా నిలుస్తున్నారు. పోలీసుల సేవా కార్యక్రమాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.