ప్రభుత్వం వ్యవసాయాన్ని, సాగునీటిని నిర్లక్ష్యం చేస్తోంది

కడప జిల్లా - వేంపల్లి - వ్యవసాయం, సాగునీటి రంగాలను జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఏపీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు.

Update: 2020-05-26 07:17 GMT
Tulasi Reddy (File Photo)

కడప జిల్లా - వేంపల్లి - వ్యవసాయం, సాగునీటి రంగాలను జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఏపీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన వేంపల్లెలో విలేకరులతో మాట్లాడారు. ఆంద్రప్రదేశ్ వ్యవసాయ ప్రధానమైనటు వంటి రాష్ట్రం అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి అగ్రతాంబూలం ఇచ్చాయని పేర్కొన్నారు.

దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని దుయ్యబట్టారు. మ్యాన్ ఫెస్ట్ ప్రకారం ప్రతి రైతుకు ప్రతి ఏడాదికి 12500 రూపాయలు ఇవ్వాలి. కానీ ఒక్కసారిగా అందులో ఐదు వేల రూపాయలు కోత విధించారని ఆవేదన వ్యక్తం చేశారు.. రైతు రుణమాఫీ కింద ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నారు.

రైతులకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారని, సీఎం సొంత నియోజకవర్గంలోనే చిన్నరంగాపురం గ్రామంలో బాల్ రెడ్డి అనే రైతు చీనీ పంట పండి అమ్ముడుపోక ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. వ్యవసాయంపై సూచనలు ఇవ్వమని ప్రభుత్వం అడిగింది. కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టమైన సూచనలు చేస్తోందంటూ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సూచనలుగా తులసిరెడ్డి చెప్పినవి ఇవే!

- రైతు భరోసా క్రింద 12500 రూపాయలు ఇవ్వాలి.

- రైతు రుణమాఫీ కింద ఎనిమిది వేల వందల కోట్లు పెండింగ్ ఉంది అది ఇవ్వాలి.

- ధరల స్థిరీకరణ నిధిని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాలి.

- వ్యవసాయ రంగానికి సాగునీటి రంగానికి వచ్చే ఏడాదైనా అధిక నిధులు కేటాయించాలని సూచించారు.


Tags:    

Similar News