కడపలో ముగిసిన కాంగ్రెస్ చింతన్ శిబిర్

Congress: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ

Update: 2022-06-06 01:41 GMT

కడపలో ముగిసిన కాంగ్రెస్ చింతన్ శిబిర్

Congress: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ రైతుకు రుణమాఫీ లేదా రుణవిముక్తి కల్పస్తామని ఏపీ పీసీసీ తీర్మానించింది. కడప పట్టణంలో రెండు రోజులు పాటు జరిగిన నవ సంకల్ప్ శివిర్ లో కాంగ్రెస్ పార్టీని సంస్ధాగత ఎన్నికల నాటికి బలోపేతం చేసేందుకు మేథోమథనం జరిగింది. రైతుల ఖాతాల్లో నెల నెల ఆరు వేల రూపాయలు జమచేయడంతో పాటు రైతుకు ఆసరగా ఉండేందుకు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని , వ్యవసాయ, సాగు నీటి రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించాలని ఆపార్టీ నేతలు తీర్మానం చేశారు.

అలాగే ప్రతి మండల కేంద్రంలో కోల్డ్ స్టోరేజీ, గిడ్డంగి సౌకర్యాలతో మార్కెట్ యార్డులు, పుఠ్ పాత్ లను ఏర్పాటు చేస్తామన్నారు. ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించనున్నట్లు తీర్మానం చేశారు. వ్యవసాయ పంపు సెంటలకు మీటర్లు బిగస్తే తొలగిస్తామని చెప్పారు.

Tags:    

Similar News