డిసెంబర్ 25 లోగా ఎన్నికలు నిర్వహించండి : టీడీపీ నేతలకు బాబు ఆదేశం

Update: 2019-11-23 02:12 GMT

పార్టీ కీర్తిని 1984-85 స్థాయికి పునరుజ్జీవింపజేస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు హామీ ఇచ్చారు. ఇకనుంచి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. పార్టీ నాయకులతో ఉండవల్లిలోని తన ఇంట్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 16,000 గ్రామ కమిటీలకు, 900 మండల, పట్టణ కమిటీలకు ఎన్నికల ప్రక్రియను డిసెంబర్ 25 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కమిటీలో 33 శాతం పోస్టులను యువతకు, మూడోవంతు మహిళలకు ఇస్తున్నట్టు చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ, బిసి మరియు మైనారిటీలకు 50 శాతం పోస్టులు ఇవ్వాలని వారితో చెప్పారు. అలాగే ఈ ఎన్నికలలో పారదర్శకత అవసరమని ఆయన నొక్కి చెప్పారు. మూడు సభ్యుల కమిటీలు ఎన్నికలను పర్యవేక్షిస్తాయని చెప్పారు. అలాగే త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ నాయకులను, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వ విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని.. ప్రజలకు తోడ్పాటుగా ఉండాలని నేతలను కోరారు. ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి రివర్స్ దిశలో సాగుతోందని ఆయన ఆరోపించారు. 

Tags:    

Similar News