Lockdown In West Godavari, Anantapur : ఎపీలో ఆ జిల్లాల్లో లాక్‌డౌన్‌!

Lockdown In West Godavari, Anantapur : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు

Update: 2020-08-02 09:30 GMT
complete lockdown in west Godavari and anantapur districts in andhrapradesh

Lockdown In West Godavari, Anantapur : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు వస్తున్నాయి. దీనితో అధికారులు చర్యలు చేపట్టారు. కేసులు పెరుగుతున్న జిల్లాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. అందులో భాగంగానే ప‌శ్చిమగోదావ‌రి జిల్లా, అనంత‌పురం జిల్లాలో ఆదివారం పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్నది. జూన్ 1 త‌ర్వాత రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించ‌డం ఇదే మొద‌టిసారి కావడం విశేషం.. పూర్తి స్థాయి లాక్ డౌన్ సమయంలో మెడిక‌ల్ షాపులు మాత్రమే తెరిచి ఉంటాయ‌ని అధికారులు ప్రక‌టించారు.

క‌రోనా వ్యాప్తిని నివారించడానికి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఆదివారం 114 సెక్షన్ విధించారు. జిల్లాలో జూలై 23 నాటికి అక్కడ 10 వేల కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం అక్కడ 11,233 పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ప‌దివేల కేసులు దాటిన మొద‌టి జిల్లాగా నిలిచింది. ఇక ఈ జిల్లా త‌ర్వాత అనంత‌పురం, క‌ర్నూల్‌, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధికంగా కేసులు న‌మోద‌వుతున్నాయి.

ఇక రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 9,276 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 60,797 శాంపిల్స్‌ని పరీక్షించగా 9,276 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 12,750 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి అకడ మొత్తం కేసులు 1,47,314కి చేరుకుంది. 

Tags:    

Similar News